ఆకాశవాణి టవర్ ఎక్కి వ్యక్తి హల్చల్ | Man climbs up all india radio Tower in hyderabad | Sakshi
Sakshi News home page

ఆకాశవాణి టవర్ ఎక్కి వ్యక్తి హల్చల్

Nov 19 2014 8:49 AM | Updated on Sep 2 2017 4:45 PM

ఆకాశవాణి టవర్ ఎక్కి వ్యక్తి హల్చల్

ఆకాశవాణి టవర్ ఎక్కి వ్యక్తి హల్చల్

అసెంబ్లీ ఎదుట ఉన్న ఆకాశవాణి కేంద్రంలో బుధవారం తెల్లవారుజామున ఓ వ్యక్తి హల్చల్ చేశాడు.

హైదరాబాద్ : అసెంబ్లీ ఎదుట ఉన్న ఆకాశవాణి కేంద్రంలో బుధవారం తెల్లవారుజామున ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. పక్కా ఇళ్లు నిర్మించాలన్న డిమాండ్‌తో భీమ్‌రావ్వాడ బస్తీకి చెందిన కొమరయ్య అనే వ్యక్తి టవర్ ఎక్కాడు. గతంలో భీమ్‌రావ్వాడ ఇళ్లను కూల్చేసిన విషయం తెలిసిందే. దీంతో అదే చోట పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని అతను డిమాండ్ చేస్తున్నాడు. ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చేంత వరకూ కిందకు దిగేది లేదని తేల్చి చెప్పాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అతడిని కిందికు దించే ప్రయత్నం చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement