లవర్ శాక్రిఫైస్! | Sakshi
Sakshi News home page

లవర్ శాక్రిఫైస్!

Published Sat, Jan 24 2015 11:34 PM

లవర్ శాక్రిఫైస్! - Sakshi

ఇదో రకం గోల! రియాల్టీ షోను రియల్ లైఫ్‌గా మార్చేస్తున్న జాతర! విషయమేమంటే... బిగ్‌బాస్ హౌస్‌లో హాట్ టాపిక్ ఉపెన్, కరిష్మాల సాన్నిహిత్యం. ఇద్దరూ ఒకరినొకరు వదిలి ఉండలేకపోతున్నారు. హౌస్‌లో కెమెరా కన్ను పడని చోట... లిప్‌లాక్‌లతో మైమరచిపోతున్నారు.

ఇది చూసిన కరిష్మా బాయ్‌ఫ్రెండ్ రుషబ్ చోక్సీ హర్టయినట్టున్నాడు. ‘నువ్వు నాకు నచ్చలేదు’ అంటూ తన ప్రేయసికి చెప్పేశాడు. వరుస ట్వీట్స్‌తో ఉపెన్- కరిష్మాల రొమాంటిక్ టచ్ గురించి ప్రస్తావించిన రుషబ్... తన బాధను చెప్పకనే చెప్పాడు. చివరకు... ‘ఉపెన్ ఇక కరిష్మా నీదే. నేను మరో మంచి గాళ్‌ఫ్రెండ్‌ను వెతుక్కుంటా’ అని ముగించాడు చిలిపిగా!

Advertisement
 
Advertisement
 
Advertisement