మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అదృశ్యం | lady techie go missing in hyderabad | Sakshi
Sakshi News home page

మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అదృశ్యం

Oct 10 2014 8:05 AM | Updated on Sep 2 2017 2:38 PM

మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అదృశ్యం

మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అదృశ్యం

కూకట్పల్లి ప్రాంతానికి చెందిన భవ్యశ్రీ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అదృశ్యం అయ్యారు.

కూకట్పల్లి ప్రాంతానికి చెందిన భవ్యశ్రీ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అదృశ్యం అయ్యారు. గురువారం ఉదయం ఆమె క్యాబ్లో డ్యూటీకి బయల్దేరారు. క్యాబ్లో వెళ్తున్నట్లుగా భర్తకు సెల్ఫోన్లో మెసేజ్ కూడా పెట్టారు. అయితే ఇంతవరకు ఆమె మాత్రం ఇంటికి తిరిగి రాలేదు. దాంతో తన భార్య కనిపించడంలేదంటూ భవ్యశ్రీ భర్త కార్తీక్ చైతన్య కూకట్పల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

విజయవాడకు చెందిన భవ్యశ్రీ చరిత, కార్తీక్ సుమారు రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. కేపీహెచ్బీ కాలనీలోని ఏడో ఫేజ్లో నివాసం ఉంటారు. గురువారం ఉదయం 9 గంటలకు  తాను క్యాబ్లో ఆఫీసుకు బయల్దేరినట్లు ఆమె భర్తకు మెసేజ్ పెట్టింది. సుమారు గంట తర్వాత కార్తీక్ ఫోన్ చేయగా, ఆమె ఫోన్ ఆన్సర్ చేయలేదు. ఆఫీసులో బిజీగా ఉందనుకుని ఊరుకుని మళ్లీ మధ్యాహ్నం, సాయంత్రం ట్రై చేసినా ఫలితం లేదు. దాంతో ఆఫీసుకు వెళ్లి అడిగితే.. అక్కడివాళ్లు ఆమె రాలేదని చెప్పారు.

స్థానికులను అడిగితే.. వాళ్లిద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటారని, ఎలాంటి గొడవలు లేవని చెప్పారు. కానీ పోలీసుల విచారణలో మాత్రం భవ్యశ్రీ చరిత గత కొన్ని రోజులుగా విధులకు హాజరు కావట్లేదని తెలిసింది. దాంతో ఆమె తనంతట తానే ఎక్కడికైనా వెళ్లిపోయిందా లేక ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా అనే కోణంలో కూకట్పల్లి పోలీసులు విచారణ సాగిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement