కేసీఆర్ను కలిసిన కృష్ణ దంపతులు | krishna, vijaya nirmala meets kcr in cm camp office | Sakshi
Sakshi News home page

కేసీఆర్ను కలిసిన కృష్ణ దంపతులు

Dec 7 2015 6:58 PM | Updated on Aug 15 2018 9:30 PM

కేసీఆర్ను కలిసిన కృష్ణ దంపతులు - Sakshi

కేసీఆర్ను కలిసిన కృష్ణ దంపతులు

హీరో కృష్ణ, విజయనిర్మల దంపతులు క్యాంప్ ఆఫీస్కు వెళ్లి తెలంగాణ సీఎం కేసీఆర్ను కలిశారు.

హైదరాబాద్: హీరో కృష్ణ దంపతులు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు (కేసీఆర్)ను సోమవారం సాయంత్రం కలిశారు. కృష్ణ, విజయనిర్మల దంపతులు ఇద్దరూ కలిసి బేగంపేటలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి వెళ్లి.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు. కృష్ణ సోదరుడు, ప్రముఖ నిర్మాత  ఆది శేషగిరిరావు కుమారుడి వివాహం త్వరలోనే ఉండటంతో, ఆ వివాహానికి హాజరై కొత్త దంపతులను ఆశీర్వదించాల్సిందిగా కృష్ణ దంపతులు కేసీఆర్ను కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement