నేడు కృష్ణా బోర్డు భేటీ | Krishna Board meeting today | Sakshi
Sakshi News home page

నేడు కృష్ణా బోర్డు భేటీ

Aug 22 2017 2:08 AM | Updated on Sep 12 2017 12:41 AM

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కీలక సమావేశం మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో జరగనుంది.

కొత్త ప్రాజెక్టులు, వర్కింగ్‌ మాన్యువల్‌పై చర్చ
 
సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కీలక సమావేశం మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో జరగనుంది. ఈ భేటీలో బోర్డు చైర్మన్‌ హెచ్‌కే సాహూ, సభ్య కార్యదర్శి సమీర్‌ చటర్జీతోపాటు ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ కార్యదర్శులు ఎస్‌కే జోషి, శశిభూషణ్‌కుమార్, ఈఎన్‌సీలు మురళీధర్, వెంకటేశ్వర్లు, అంతర్రాష్ట్ర జల వివాదాల విభాగం అధికారులు పాల్గొననున్నారు.

మొత్తం 8 అంశాలపై బోర్డులో చర్చించనుండగా ప్రధాన చర్చ  కొత్తప్రాజెక్టులు, ఈ ఏడాదికి వర్కింగ్‌ మాన్యువల్, నీటి పంపిణీ, చిన్న నీటి వనరుల కింద నీటి వినియోగంపైనే ఉండనుంది. ముఖ్యంగా ఏపీ చేపట్టిన ఆయా ప్రాజెక్టుల నీటి వినియోగంపై తెలంగాణ ప్రశ్నించనుంది. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల నుంచి తెలంగాణకు దక్కాల్సిన వాటాలపైనా నిలదీయనుంది. రాష్ట్రానికి చెందిన పాలమూరు, డిండి, భక్తరామదాస ప్రాజెక్టులు కొత్తగా చేపట్టినవి కావని స్పష్టం చేయనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement