గ్రామ పంచాయతీలకు ఇస్తున్న నిధులను దారి మళ్లీస్తున్నారంటూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి.కిషన్రెడ్డి మండిపడ్డారు.
హైదరాబాద్ : గ్రామ పంచాయతీలకు ఇస్తున్న నిధులను దారి మళ్లీస్తున్నారంటూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి.కిషన్రెడ్డి మండిపడ్డారు. ఆదివారం హైదరాబాద్లోని కొంపల్లిలో బీజేపీ కార్యవర్గం సమావేశమైంది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి జి.కిషన్రెడ్డి ప్రసంగించారు. రాష్ట్రంలోని స్థానిక సంస్థలను టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు.
రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని టీఆర్ఎస్పై జి.కిషన్రెడ్డి నిప్పులు చెరిగారు. తెలంగాణకు కేంద్రం ఇస్తున్న నిధులపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరవు సహాయక చర్యల్లో టీఆర్ఎస్ పూర్తిగా విఫలమైందన్నారు. ప్రచార ఆర్భాటాలకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు. ఈ కార్యవర్గ సమావేశానికి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, మురళీధర్రావు హాజరయ్యారు.