కారు-లారీ ఢీకొని మహిళ మృతి | kid died in a road accident in hyderebad | Sakshi
Sakshi News home page

కారు-లారీ ఢీకొని మహిళ మృతి

Dec 29 2016 7:19 AM | Updated on Aug 30 2018 4:10 PM

కారు-లారీ ఢీకొని మహిళ మృతి - Sakshi

కారు-లారీ ఢీకొని మహిళ మృతి

నగర శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ చనిపోగా మరో ముగ్గురు గాయపడ్డారు.

హైదరాబాద్: నగర శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ చనిపోగా మరో వ్యక్తికి, ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. హయత్‌నగర్ మండలం వర్డ్ అండ్ డీడీ పాఠశాల సమీపంలో బుధవారం అర్థరాత్రి జరిగిన ఈ ఘటన వివరాలివీ.. జీడిమెట్లకు చెందిన కె.రవిచంద్ అనే లెక్చరర్ తన భార్య రాధిక(38)కుమార్తె జాహ్నవి(14), కుమారుడు ఆదర్శ్(12)తో కలిసి విజయవాడ నుంచి కారులో వస్తున్నారు.

వర్డ్ అండ్ డీడ్ స్కూలు సమీపంలో రాంగ్ రూట్‌లో రోడ్డు దాటుతున్న లారీని వేగంగా వచ్చిన వారి కారు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన నలుగురిని వెంటనే సమీపంలోని గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపటికే రాధిక చనిపోయింది. మిగతా వారు చికిత్స పొందుతున్నారు. వారికి ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
 

Advertisement
 
Advertisement
Advertisement