తెలంగాణ మంత్రివర్గంలో మార్పులు? | kcr to meet governor, cabinet reshuffle expected | Sakshi
Sakshi News home page

తెలంగాణ మంత్రివర్గంలో మార్పులు?

Oct 2 2015 12:42 PM | Updated on Aug 21 2018 11:41 AM

తెలంగాణ మంత్రివర్గంలో మార్పులు? - Sakshi

తెలంగాణ మంత్రివర్గంలో మార్పులు?

రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ను తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కలవనున్నారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగిసిన తర్వాత తన మంత్రివర్గంలో ఆయన మార్పుచేర్పులు చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ను తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కలవనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగిసిన తర్వాత తన మంత్రివర్గంలో ఆయన మార్పుచేర్పులు చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో గవర్నర్ నరసింహన్తో కేసీఆర్ వరుస భేటీలతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కేబినెట్లో మార్పులు ఉండటం ఖాయమని అటు ప్రభుత్వంలోను, ఇటు పార్టీలో కూడా జోరుగా చర్చలు జరుగుతున్నాయి. కేబినెట్లో మహిళలకు స్థానం కల్పించడంతో పాటు, సామాజిక వర్గాల ప్రకారం కూడా చోటు కల్పిస్తారని చర్చలు నడుస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement