కందిపప్పు డబుల్ సెంచరీ | kandipappu 1 kg cost rupees 200 | Sakshi
Sakshi News home page

కందిపప్పు డబుల్ సెంచరీ

Oct 15 2015 2:42 AM | Updated on Sep 3 2017 10:57 AM

కందిపప్పు డబుల్ సెంచరీ

కందిపప్పు డబుల్ సెంచరీ

భాగ్యనగరంలో కందిపప్పు ధర మండిపోతోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బుధవారం ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది.

ఆల్‌టైమ్ రికార్డు ధర.. కిలో రూ.200
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో కందిపప్పు ధర మండిపోతోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బుధవారం ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది. కేజీ ధర హోల్‌సేల్‌లోనే రూ.200కి ఎగబాకింది. రిటైల్ మార్కెట్‌లో మరో రూ.5 నుంచి రూ.6 అదనంగా గుంజుతున్నారు. కందిపప్పు ధర రూ.200 దాటడం ఎన్నడూ చూడలేదని వ్యాపారులే ఆశ్చర్యపోతున్నారు. కొందరు హోల్‌సేల్ వ్యాపారులు పెద్దమొత్తంలో కందిపప్పును నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టించటంతో రేట్లు పెరిగిపోతున్నాయి. మినపపప్పు కూడా చుక్కలనంటుతోంది. హోల్‌సేల్‌లో కిలో రూ.185, రిటైల్‌లో రూ.190 పలుకుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement