ప్రభుత్వంపై ఉద్యమానికి సన్నద్ధం: లక్ష్మణ్ | k.laxman ready to fight against trs government | Sakshi
Sakshi News home page

ప్రభుత్వంపై ఉద్యమానికి సన్నద్ధం: లక్ష్మణ్

Sep 21 2014 3:34 AM | Updated on Mar 29 2019 9:24 PM

ప్రజాసమస్యలను పరిష్కరించాల్సిందిపోయి కేవలం రాజకీయాలతో కాలం నెట్టుకొస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఉద్యమానికి సన్నద్ధమవుతున్నట్టు బీజేపీ శాసనసభాపక్ష నేత డాక్టర్ కె.లక్ష్మణ్ పేర్కొన్నారు.

సాక్షి, హైదరాబాద్: ప్రజాసమస్యలను పరిష్కరించాల్సిందిపోయి కేవలం రాజకీయాలతో కాలం నెట్టుకొస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఉద్యమానికి సన్నద్ధమవుతున్నట్టు బీజేపీ శాసనసభాపక్ష నేత డాక్టర్ కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. ఇందుకోసం ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్టు చెప్పారు. శనివారం ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడారు. సమస్యలపై చర్చించే వేదికైన అసెంబ్లీని సమావేశపర్చకుండా వాయిదా వేయడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. వినూత్న బడ్జెట్ పేరు చెప్పి వాయిదా వేస్తూ రావటం ప్రజలపాలిట శాపంగా మారిందని లక్ష్మణ్ పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు అవసరమైన నిధులు లేకపోవటమే దీనికి కారణమా? అనే అంశంపై సీఎం కేసీఆర్ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement