జానకిరామ్ మృతదేహం హరికృష్ణ ఇంటికి తరలింపు | janakiram Deadbody moved to Harikrishna's home | Sakshi
Sakshi News home page

జానకిరామ్ మృతదేహం హరికృష్ణ ఇంటికి తరలింపు

Dec 7 2014 5:26 AM | Updated on Sep 2 2017 5:44 PM

పోస్ట్మార్టం అనంతరం జానకిరామ్ మృతదేహాం

పోస్ట్మార్టం అనంతరం జానకిరామ్ మృతదేహాం

నందమూరి జానకిరామ్ మృతదేహాన్ని మసబ్ట్యాంక్ సమీపంలోని నందమూరి హరికృష్ణ ఇంటికి తరలించారు.

హైదరాబాద్: నందమూరి జానకిరామ్ మృతదేహాన్ని మసబ్ట్యాంక్ సమీపంలోని నందమూరి హరికృష్ణ  ఇంటికి తరలించారు.  నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద  శనివారం సాయంత్రం జరిగిన కారు ప్రమాదంలో  జానకిరామ్ దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. జానకిరామ్ మృతదేహాన్నిఅతని సోదరుడు కల్యాణరామ్ కోదాడ నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఉస్మానియా ఆస్పత్రిలో  డాక్టర్ జనార్ధన్, డాక్టర్ సత్యవతి ఆధ్వర్యంలో వైద్యుల బృందం  పోస్ట్ మార్టం పూర్తి చేశారు.

ఉస్మానియా వైద్యుల పోస్ట్ మార్టం నివేదిక ప్రకారం జానకిరామ్ తలకు, చాతికి, కడుపు భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. కుడి చేయి, కుడి కాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పక్కటెముకలు విరిగి రక్త సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆయన మృతి చెందినట్లు వైద్యులు తమ నివేదికలో పేర్కొన్నారు.
**

Advertisement
 
Advertisement
Advertisement