కేటీఆర్ జన్మదినం... విమానాలతో పూల వర్షం | IT Minister KTR Birthday Celebrations by Fans | Sakshi
Sakshi News home page

కేటీఆర్ జన్మదినం... విమానాలతో పూల వర్షం

Jul 24 2016 12:07 PM | Updated on Sep 4 2017 6:04 AM

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు.

హైదరాబాద్ : తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఆదివారం హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన అభిమానులు మూడు విమానాలతో పూల వర్షం కురిపించారు. టీఆర్ఎస్ భవన్, ట్యాంక్ బండ్లోని బుద్ధునిపైన, కేటీఆర్ చిత్ర పటం ఉన్న ప్రదేశాల్లో పూల వర్షం కురిపించారు.

అలాగే నగర శివారులోని పలు ప్రాంతాలతోపాటు అడవుల్లో విమానాల ద్వారా పది లక్షల మొక్కల విత్తనాలు చల్లి తమ అభిమానాన్ని చాటుకున్నారు. మెదక్, ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో కూడా హెలికాప్టర్ ద్వారా విత్తనాలు జల్లుతున్నారు. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డీఎస్ శిష్యుడు అయిన కె ఎం ప్రతాప్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement