బులెటిన్ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం | Sakshi
Sakshi News home page

బులెటిన్ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం

Published Fri, May 6 2016 8:18 PM

బులెటిన్ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం - Sakshi

తెలంగాణ వైఎస్ఆర్‌ కాంగ్రెస్ శాసనసభా పక్షం టీఆర్ఎస్‌లో విలీనం అయినట్లుగా అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి బులెటిన్ ఇవ్వడం అనైతికం, రాజ్యాంగ విరుద్ధమని పార్టీ తెలంగాణ విభాగం నేతలు కేవీ రాఘవరెడ్డి, శివకుమార్ పేర్కొన్నారు. ఒక పార్టీ తరఫున ఎన్నికైన శాసనసభ్యుడు మరో పార్టీలో చేరడాన్ని రాజ్యాంగం పూర్తిగా నిషేధిస్తోందని, నూటికి నూరుశాతం సభ్యులు వేరే పార్టీలో చేరినా ఆ చర్య రాజ్యాంగ విరుద్ధమేనని పేర్కొన్నారు.

స్పీకర్ నిర్ణయానికి ఉన్న రాజ్యాంగ బద్ధత ఏంటో ఆయనే వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు ఫిరాయించినంత మాత్రాన పార్టీ విలీనం అయినట్లు కాదని, ఇలాంటి అనైతిక చర్యలకు తావివ్వడం అంటే ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద గౌరవం లేకపోవడమేనని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని తాము సవాలు చేస్తామని వారు స్పష్టం చేశారు.

అంతకుముందు వైఎస్ఆర్‌సీఎల్పీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, బానోత్ మదన్ లాల్ ఇచ్చిన లేఖ మేరకు వైఎస్‌ఆర్‌సీఎల్పీని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేస్తున్నట్లు అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం ఒక బులెటిన్ జారీ చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement