breaking news
kv raghava reddy
-
సైకో సూరి అరెస్ట్
సాక్షి, కోవూరు: కోవూరులో అలజడి రేపి జిల్లాలో సంచలనం సృష్టించిన సైకోను ఎట్టకేలకు పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేయడంతో కథ సుఖాంతం అయింది. స్థానిక సీఐ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నెల్లూరురూరల్ డీఎస్పీ కేవీ రాఘవరెడ్డి సైకో వివరాలను వెల్లడించారు. నెల్లూరు వెంకటేశ్వరపురం గాంధీజన గిరిజనకాలనీకి చెందిన పాత నేరస్తుడు ఇండ్ల సూరి ప్రస్తుతం మకాంను కోవూరు నాగులకట్టకు మార్చాడు. ఈ ఏడాది మార్చి 1న జలదంకి విజయమ్మ (55) మహిళ ఇంట్లోకి చొరబడి అత్యాచారయత్నం చేశాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో కత్తితో పొడిచి, తలపై రోకలిబండతో మోది రక్తమోడేలా చేశాడు. బంధువులు వచ్చి తలుపులు తెరవగా నెట్టుకుంటూ నగ్నంగా పారిపోయాడు. అదే రోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో లైబ్రరీ సెంటర్ వద్ద టిఫిన్ అంగడి పెట్టుకుని నివాసముంటున్న ఒంటేరు అంకమ్మ (65) ఇంట్లో ప్రవేశించి డబ్బు, బంగారం ఇవ్వమని బెదిరించాడు. ఇవ్వకపోవడంతో తలపై గెరిటతో కొట్టాడు. దీంతో ఆ మహిళ తన వద్ద రూ.400 చిల్లర డబ్బులను ఇచ్చింది. అక్కడి నుంచి పరారైన సూరి అదే రోజు తెల్లవారు జామున 4 గంటల సమయంలో దేసూరివారి వీధిలో నివాసముంటున్న ఇమ్మడిశెట్టి సుభాషిణి ఇంట్లోకి చొరబడ్డాడు. బీరువాలోని రూ.6 వేల నగదు, రెండు జతల వెండి కాళ్ల పట్టీల గొలుసులు చోరీ చేసి పరారవుతుండగా సుభాషిణి చూసి కేకలు వేయడంతో ఆమె తలను గోడకేసి కొట్టి పరారయ్యాడు. అనంతరం 5.30 గంటలకు పూనూరువారి వీధిలో నివాసముంటున్న చేజర్ల నాగమణి అనే మహిళ ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా మెడలోని గొలుసును లాగేందుకు ప్రయత్నించాడు. ఆమె గట్టిగా అరచి ప్రతిఘటించింది. అదే సమయంలో ఇద్దరు యువకులు వస్తుండగా వారిని నెట్టుకుంటూ పారిపోయాడు. సూరిని పట్టుకునేందుకు జిల్లా ఎస్పీ రామకృష్ణ ఆదేశాల మేరకు సబ్ డివిజన్ పరిధిలో కోవూరు సీఐ ఐ.వెంకటేశ్వర్లురెడ్డి పర్యవేక్షణలో కోవూరు, సంగం ఎస్సైలు అళహరి వెంకట్రావు, వేణు సహకారంతో పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. సూరిబాబును శుక్రవారం తెల్లవారుజామున కోవూరు నాగలకట్ట వద్ద నివాసముంటున్న ఇంట్లో ఉండగా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. సూరిబాబును అరెస్ట్ చేయడానికి అహర్నిశలు కృషి చేసిన 51 మంది పోలీసులకు ఎస్పీ ప్రత్యేక రివార్డులు ప్రకటించారన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వరరెడ్డి, కోవూరు, సంగం ఎస్సైలు వెంకట్రావు, వేణు, హెడ్‌కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, విజయభాస్కర్, రఘనాథ్, కానిస్టేబుళ్లు ప్రసాద్, సతీష్, సుబ్బారావు, శ్రీనివాసులురెడ్డి, మురళీ పాల్గొన్నారు. 51 కేసుల్లో నిందితుడు సూరి గతంలో కూడా అనేక నేరాలకు పాల్ప డ్డాడు. 2014 అక్టోబరు 20న ఆటో నడుపుకుం టున్న ఇండ్ల సూరి చల్లా అంకమ్మ అనే వృద్ధురాలిని ఆటో ఎక్కించుకుని జొన్నవాడకు వెళ్లాడు. రాత్రి అంగన్వాడీ భవనంలో నిద్రి స్తున్న అంకమ్మ వద్ద ఆభరణాలు దొంగిలించేందుకు ప్రయత్నిం చాడు. ఆమె గట్టిగా అరుస్తుండటంతో పక్కనే ఉన్న సన్నతా డుతో మెడకు బిగించి హత్య చేశాడు. ఆమె చెవిలో ఉన్న క మ్మలను తెంచుకుని పారిపోయాడు. సూరిబాబు గతంలో కోవూ టరు, నెల్లూరు, నెల్లూరు రూరల్, బుచ్చిరెడ్డిపాళెం, నాయుడుపేట, గూడూరు, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి, తిరుపతి, ఎంఆర్‌పల్లి, అలిపిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో 2003 నుంచి ఇప్పటి వరకు సుమారు 51 కేసుల్లో నిందితుడు. తిరుపతికి సంబం«ధించిన ఓ కేసులో 11 నెలల పాటు చిత్తూరు, కడప జైలులో శిక్ష అనుభవించి బయటకు వచ్చాడు. సూరి ఒంటరిగా ఉన్న మహిళలపై అత్యాచారం చేయడం వారి వద్ద వస్తువుల్ని దౌర్జన్యంగా తీసుకువెళ్లడం అతని నైజం. -
బులెటిన్ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం
తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ శాసనసభా పక్షం టీఆర్ఎస్లో విలీనం అయినట్లుగా అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి బులెటిన్ ఇవ్వడం అనైతికం, రాజ్యాంగ విరుద్ధమని పార్టీ తెలంగాణ విభాగం నేతలు కేవీ రాఘవరెడ్డి, శివకుమార్ పేర్కొన్నారు. ఒక పార్టీ తరఫున ఎన్నికైన శాసనసభ్యుడు మరో పార్టీలో చేరడాన్ని రాజ్యాంగం పూర్తిగా నిషేధిస్తోందని, నూటికి నూరుశాతం సభ్యులు వేరే పార్టీలో చేరినా ఆ చర్య రాజ్యాంగ విరుద్ధమేనని పేర్కొన్నారు. స్పీకర్ నిర్ణయానికి ఉన్న రాజ్యాంగ బద్ధత ఏంటో ఆయనే వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు ఫిరాయించినంత మాత్రాన పార్టీ విలీనం అయినట్లు కాదని, ఇలాంటి అనైతిక చర్యలకు తావివ్వడం అంటే ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద గౌరవం లేకపోవడమేనని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని తాము సవాలు చేస్తామని వారు స్పష్టం చేశారు. అంతకుముందు వైఎస్ఆర్‌సీఎల్పీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, బానోత్ మదన్ లాల్ ఇచ్చిన లేఖ మేరకు వైఎస్‌ఆర్‌సీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేస్తున్నట్లు అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం ఒక బులెటిన్ జారీ చేశారు.