తెలంగాణలో పలువురు ఐపీఎస్‌ల బదిలీలు | IPS transfers in Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో పలువురు ఐపీఎస్‌ల బదిలీలు

May 21 2016 5:49 PM | Updated on Sep 4 2018 5:21 PM

రాష్ట్రంలో పలువురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రంలో పలువురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మూడు రోజుల క్రితం దాదాపు 24 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం తాజాగా మరో నలుగురికి స్థాన చలనం కల్పించింది. హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ అడిషనల్ కమిషనర్‌గా ఉన్న వై.నాగిరెడ్డిని నార్త్‌జోన్ ఐజీగా బదిలీ అయ్యారు.

వరంగల్ రేంజ్ డీఐజీగా ఉన్న బి.మల్లారెడ్డికి ఐజీగా పదోన్నతి కల్పిస్తూ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డెరైక్టర్‌గా నియమించారు.  సీసీఎస్ జాయింట్ కమిషనర్‌గా ఉన్న టి.ప్రభాకర్‌రావు వరంగల్ రేంజ్ డీఐజీగా బదిలీ అయ్యారు. నార్త్ జోన్ ఐజీ ఉన్న నవీన్‌చంద్‌ను బదిలీ చేసిన ప్రభుత్వం ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా నవీన్‌చంద్‌కు సూచిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement