ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య | inter student suicide in hyderabad | Sakshi
Sakshi News home page

ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

Feb 5 2016 11:45 AM | Updated on Nov 9 2018 5:02 PM

ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మాదాపూర్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో శుక్రవారం వెలుగుచూసింది.

హైదరాబాద్: ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మాదాపూర్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో శుక్రవారం వెలుగుచూసింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌కు చెందిన సాయికృష్ణ(16) స్థానిక కళాశాలలో ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈక్రమంలో గురువారం రాత్రి వైర్‌తో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement