హాస్టల్లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య | inter student committed suicide in college hostel | Sakshi
Sakshi News home page

హాస్టల్లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

Feb 20 2016 9:24 PM | Updated on Nov 6 2018 7:56 PM

నగరంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

హైదరాబాద్: నగరంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నిజాంపేట్ లోని ఓ ప్రైవేట్ కాలేజీ బాయ్స్ హాస్టల్లో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. నాగాలాండ్‌కు చెందిన తెచ్మా(17) స్థానిక కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు హాస్టల్ గదిలో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి సంఘం నాయకులు కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement