కుత్బుల్లాపూర్‌లో శిశు విక్రయం | Infant sold | Sakshi
Sakshi News home page

కుత్బుల్లాపూర్‌లో శిశు విక్రయం

Jun 24 2016 7:27 PM | Updated on Sep 19 2018 8:32 PM

పెళ్లి కాకుండానే పుట్టిన పసికందును అమ్మేసి, ఆ యువతికి మరొకరితో పెళ్లి చేశారు. అయితే శిశు విక్రయ విషయం పోలీసుల దాకా వెళ్లటంతో చివరికి చిన్నారి ఐసీడీఎస్ అధికారుల ఒడికి చేరింది.

హైదరాబాద్ : పెళ్లి కాకుండానే పుట్టిన పసికందును అమ్మేసి, ఆ యువతికి మరొకరితో పెళ్లి చేశారు. అయితే శిశు విక్రయ విషయం పోలీసుల దాకా వెళ్లటంతో చివరికి చిన్నారి ఐసీడీఎస్ అధికారుల ఒడికి చేరింది. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం బాచుపల్లి గ్రామ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ యువతి పెళ్లికి ముందే గర్భం దాల్చి కూతురికి జన్మనిచ్చింది.

అయితే, ఆమె తల్లి, అమ్మమ్మ కలిసి మూడో కంటికి తెలియకుండా ఆ శిశువును అదే రోజు వేరొకరికి విక్రయించేశారు. ఇది జరిగి తొమ్మిది నెలలవుతోంది. కాగా సదరు యువతికి నెల క్రితం వేరే యువకుడితో పెళ్లయింది. ఇదిలా ఉండగా శిశు విక్రయం విషయం ఆనోటా ఈనోటా ఐసీడీఎస్ అధికారులకు తెలిసింది. వారు శుక్రవారం పోలీసుల సాయంతో శిశువును స్వాధీనం చేసుకుని శిశుగృహకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement