ఫ్లిప్‌కార్ట్ (Flipkart) తమ ఫ్యాషన్ విభాగంలో కొత్త తరహా షాపింగ్ అనుభవాన్ని అందించేందుకు ‘GRWM GRWM’ పేరుతో ప్రత్యేక ఫ్యాషన్ సేల్‌ను ప్రారంభించింది. మే 29 నుంచి జూన్ 7, 2026 వరకు జరిగే ఈ ఫ్యాషన్ కార్నివల్‌లో 10 లక్షలకుపైగా ట్రెండీ స్టైల్స్ వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. “Get Ready With Me” అనే గ్లోబల్ జెన్‌జీ (GenZ) ట్రెండ్‌కు భారతీయ మసాలా జోడిస్తూ “గరం గరం” శైలిలో రూపొందించిన ఈ క్యాంపెయిన్ ద్వారా ఫ్యాషన్ షాపింగ్‌ను ఒక కల్చరల్ ఎక్స్‌పీరియన్స్‌గా మార్చాలని ఫ్లిప్‌కార్ట్ లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రారంభ అంచనాల ప్రకారం ఈ సేల్‌కు 55 కోట్లకుపైగా సందర్శనలు నమోదయ్యే అవకాశం ఉండగా, అందులో సగానికి పైగా జెన్‌జీ వినియోగదారులే ఉండనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ సేల్‌లో ప్రముఖ అంతర్జాతీయ, దేశీయ బ్రాండ్లతో పాటు డైరెక్ట్ టు కన్స్యూమర్ బ్రాండ్లు, మార్కెట్‌ప్లేస్ విక్రేతలు పాల్గొంటున్నారు. బాగీ జీన్స్, కొరియన్ ట్రౌజర్స్, ఫ్లోరల్ డ్రెస్సులు, పలాజో సెట్లు వంటి తాజా ఫ్యాషన్ ట్రెండ్స్‌ను వినియోగదారులకు అందించనున్నారు.
లీవైస్, టైటన్, రెడ్ టేప్, నైక్, ప్యూమా, ఆసిక్స్, సఫారీ, రేర్ రాబిట్, ది బేర్ హౌస్ వంటి ప్రముఖ బ్రాండ్లపై 90 శాతం వరకు తగ్గింపులు, సూపర్‌కాయిన్స్ ఆఫర్లు, స్క్రాచ్ కార్డులు, బ్యాంక్ డిస్కౌంట్లు కూడా లభించనున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ బడ్జెట్ల వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఈ ఆఫర్లు రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.


