రేవంత్‌కు భద్రత పెంచండి | Increase the security to the Revanth reddy | Sakshi
Sakshi News home page

రేవంత్‌కు భద్రత పెంచండి

Jul 21 2016 4:37 AM | Updated on Aug 14 2018 11:26 AM

రేవంత్‌కు భద్రత పెంచండి - Sakshi

రేవంత్‌కు భద్రత పెంచండి

టీటీడీఎల్పీ నేత రేవంత్‌రెడ్డికి భద్రత పెంచాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ రాశారు.

కేంద్ర హోంమంత్రికి చంద్రబాబు లేఖ

 సాక్షి, హైదరాబాద్: టీటీడీఎల్పీ నేత రేవంత్‌రెడ్డికి భద్రత పెంచాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ రాశారు. భద్రత పెంపు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రేవంత్‌రెడ్డి పోరాడుతున్నారని, ఉద్యమాలు చేస్తున్నారని ఆ లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.

దీంతో ఆయనకు ప్రాణహాని ఉందని, అదనపు భద్రత కోసం హైకోర్టు కూడా ఉత్తర్వులు ఇచ్చిందని వివరించారు. రేవంత్‌కు తెలంగాణ ప్రభుత్వం వెంటనే అదనపు భద్రత కల్పించేలా కేంద్రం జోక్యం చేసుకోవాలని రాజ్‌నాథ్‌కు చంద్రబాబు తన లేఖలో విజ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement