ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)కు చెందిన సబ్‌ఇన్‌స్పెక్టర్‌పై ఇద్దరు దుండగులు దాడి చేసి.. అతని జేబులో ఉన్న రూ.28 వేల విలువైన సెల్‌ఫోన్ లాక్కుని పారిపోయారు.
సాక్షి, సిటీబ్యూరో: ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)కు చెందిన సబ్‌ఇన్‌స్పెక్టర్‌పై ఇద్దరు దుండగులు దాడి చేసి.. అతని జేబులో ఉన్న రూ.28 వేల విలువైన సెల్‌ఫోన్ లాక్కుని పారిపోయారు. బంజారాహిల్స్ పోలీసుస్టేష న్ పరిధిలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరి గింది. ఐబీ హైదరాబాద్ శాఖలోని ఎస్‌ఐ జ్యోతిశంకర్ బహద్రా శుక్రవారం రాత్రి 9 గంటలకు బేగంపేటలో ఆర్టీసీ బస్సు ఎక్కి జీవీకే మాల్ వద్ద దిగాడు.
ఆయన బస్సు దిగిన వెంటనే ఇద్దరు దుండగులు దాడి చేశా రు. అతని జేబులో ఉన్న సెల్‌ఫోన్‌ను లాక్కు ని పారిపోయారు. ఎస్‌ఐ వారిని వెంబడించి నా ఫలితం లేకపోయింది. కాగా, ఆయన ఫిర్యాదు చేసేందుకు బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు వెళ్లగా చేదుఅనుభవం ఎదురైంది. మరుసటి రోజు వచ్చి ఫిర్యాదు చేయాలని అక్కడి సిబ్బంది చెప్పారు. దీంతో సదరు ఎస్‌ఐ తీవ్ర ఆవేదనకు గురయ్యారు.