లండన్‌లో రైలు కింద పడి హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు మృత్యువాతపడ్డాడు.
సాక్షి, హైదరాబాద్: లండన్‌లో రైలు కింద పడి హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు మృత్యువాతపడ్డాడు. మీరాలం మండికి చెందిన హసన్ అలీ కుమారుడు మీర్ బాఖీర్ అలీ రిజ్వీ ఈ నెల 12న మృతి చెందినట్లు సీఐడీ పోలీసులు తెలిపారు. అతడి మృతికి సంబంధించి కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
గతేడాది లండన్‌లో కొందరు దుండగులు బాఖీర్‌పై దాడి చేయడంతో గాయాలపాలయ్యాడు. ఆ తర్వాత ఓ సారి హైదరాబాద్‌కు వచ్చి వెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత తనపై దాడి చేసిన వ్యక్తులపై కేసు పెట్టినట్లు సమాచారం. బాఖీర్‌కు పెద్ద మొత్తంలో నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించినట్లు సమాచారం. దాడిచేసిన వ్యక్తులే అతడిని పొట్టన పెట్టుకుని ఉండొచ్చని ఆరోపణలు వినిపిస్తున్నాయి.