బాలుడు కిడ్నాప్ కేసు సుఖాంతం | Hyderabad Police Traces out Rajendra Nagar Kidnap case | Sakshi
Sakshi News home page

బాలుడు కిడ్నాప్ కేసు సుఖాంతం

Oct 8 2016 12:42 PM | Updated on Sep 4 2017 4:40 PM

రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన చిన్నారి ఖలీల్ కిడ్నాప్ కేసును ఎస్ఓటీ, రాజేంద్రనగర్ పోలీసులు సంయుక్తంగా ఛేదించారు.

హైదరాబాద్ : రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన చిన్నారి ఖలీల్ కిడ్నాప్ కేసును ఎస్ఓటీ, రాజేంద్రనగర్ పోలీసులు సంయుక్తంగా ఛేదించారు. నిందితురాలని అదుపులోకి తీసుకుని... చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. చింతల్మెట్కి చెందిన మహ్మద్, సాజిదాబేగం కుమారుడు ఖలీల్, కుమార్తె రేష్మలను సోమవారం ఉదయం ఇంటి వద్ద నుంచి ఓ మహిళ ఎత్తుకెళ్లింది. కానీ రేష్మను మార్గ మధ్యలో విడిచిపెట్టింది.

దీంతో ఇంటికి వచ్చిన రేష్మ జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దాంతో వారు రాజేంద్రనగర్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి... దర్యాప్తు ప్రారంభించారు. ఆ క్రమంలో గతంలో వారి ఇంటి వద్దే నివసిస్తున్న ఫయిమ్ బేగం ఇటీవలే మరో ఇంటికి మారింది. అయితే ఆమెకు నలుగురు ఆడపిల్లలు.. మగ సంతానం లేదు. 

దీంతో ఖలీల్, రేష్మలకు అప్పటికే పరిచయం ఉన్న  ఫయిమ్ సోమవారం చాక్లెట్ ఇస్తానని చెప్పడంతో ఇద్దరు చిన్నారులు ఆమె వద్దకు వెళ్లారు.  దీంతో   ఫయిమ్ బేగం ఖలీల్ను అపహరించుకుని పోయింది. రేష్మ ఇచ్చిన చిన్న క్లూతో పోలీసులు చిన్నారి ఖలీల్ను తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో కిడ్నాప్ కథ సుఖాంతం అయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement