breaking news
Khalil
-
బాలుడు కిడ్నాప్ కేసు సుఖాంతం
హైదరాబాద్ : రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన చిన్నారి ఖలీల్ కిడ్నాప్ కేసును ఎస్ఓటీ, రాజేంద్రనగర్ పోలీసులు సంయుక్తంగా ఛేదించారు. నిందితురాలని అదుపులోకి తీసుకుని... చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. చింతల్మెట్కి చెందిన మహ్మద్, సాజిదాబేగం కుమారుడు ఖలీల్, కుమార్తె రేష్మలను సోమవారం ఉదయం ఇంటి వద్ద నుంచి ఓ మహిళ ఎత్తుకెళ్లింది. కానీ రేష్మను మార్గ మధ్యలో విడిచిపెట్టింది. దీంతో ఇంటికి వచ్చిన రేష్మ జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దాంతో వారు రాజేంద్రనగర్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి... దర్యాప్తు ప్రారంభించారు. ఆ క్రమంలో గతంలో వారి ఇంటి వద్దే నివసిస్తున్న ఫయిమ్ బేగం ఇటీవలే మరో ఇంటికి మారింది. అయితే ఆమెకు నలుగురు ఆడపిల్లలు.. మగ సంతానం లేదు. దీంతో ఖలీల్, రేష్మలకు అప్పటికే పరిచయం ఉన్న ఫయిమ్ సోమవారం చాక్లెట్ ఇస్తానని చెప్పడంతో ఇద్దరు చిన్నారులు ఆమె వద్దకు వెళ్లారు. దీంతో ఫయిమ్ బేగం ఖలీల్‌ను అపహరించుకుని పోయింది. రేష్మ ఇచ్చిన చిన్న క్లూతో పోలీసులు చిన్నారి ఖలీల్‌ను తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో కిడ్నాప్ కథ సుఖాంతం అయింది. -
అంబేద్కర్ విగ్రహం పాక్షికంగా ధ్వంసం
రంగారెడ్డి జిల్లా కుల్కచర్ల మండలం ముజాహిద్పూర్ గ్రామంలో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు సోమవారం రాత్రి పాక్షికంగా ధ్వంసం చేశారు. చేయితోపాటు నడుం కింది భాగం ధ్వంసం అయింది. మంగళవారం ఉదయం గమనించిన గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొందరు స్థానికులు విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. విగ్రహానికి నష్టం కలిగించిన వారిని పట్టుకుని శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఇన్చార్జి ఎస్ఐ ఖలీల్ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేశారు. ఇందుకు కారకులైన వారిని రెండు రోజులలో దుండగులను పట్టుకుంటామని హామీ ఇచ్చారు.