అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్‌ | Hyderabad: Inter-state gang of thieves held | Sakshi
Sakshi News home page

అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్‌

Jun 16 2017 4:05 PM | Updated on Sep 4 2018 5:24 PM

ఉత్తరప్రదేశ్‌కు చెందిన సల్మాన్‌ గ్యాంగ్‌ సభ్యులను హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌చేశారు.

హైదరాబాద్‌: తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గేట్‌గా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన సల్మాన్‌ గ్యాంగ్‌ సభ్యులను పోలీసులు అరెస్ట్‌చేశారు.

నగరంలోని తిరుమలగిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోరీలకు పాల్పడిన సల్మాన్‌ గ్యాంగ్‌కు చెందిన నలుగురు నిందితులను శుక్రవారం అరెస్ట్‌ చేసినట్లు బేగంపేట ఏసీపీ రంగారావు తెలిపారు. గ్యాంగ్‌కు చెందిన లక్ష్మణ్‌, ఫక్రుద్దీన్‌, అవినాష్‌, జావిద్‌లను అరెస్ట్‌ చేశామని పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement