ఎయిర్‌పోర్టు విస‍్తరణపై ప్రజాభిప్రాయసేకరణ | Hyderabad Airport expansion | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్టు విస‍్తరణపై ప్రజాభిప్రాయసేకరణ

Feb 28 2017 4:20 PM | Updated on Sep 5 2017 4:51 AM

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ విస్తరణ కోసం తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర‍్వహించింది.

శంషాబాద్‌: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ఆవరణలో ప్రతిపాదిత రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ కోసం తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి మంగళవారం ఉదయం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర‍్వహించింది. ఈ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ రఘునందన్ రావు ముఖ‍్యఅతిథిగా హాజరయ్యారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పాల‍్గొన‍్నారు. విమానాశ్రయ విస‍్తరణలో ఎదురయ‍్యే పర్యావరణ సమస‍్యలపై స్థానికుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం వారు ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement