సూరారం కాలనీకి భారీసంఖ్యలో పోలీసులు | huge police at suraram colony in jyderabad | Sakshi
Sakshi News home page

సూరారం కాలనీకి భారీసంఖ్యలో పోలీసులు

Oct 6 2015 6:59 AM | Updated on Aug 31 2018 9:15 PM

సూరారం కాలనీకి భారీసంఖ్యలో పోలీసులు - Sakshi

సూరారం కాలనీకి భారీసంఖ్యలో పోలీసులు

సూరారం కాలనీలోని 60 గజాల బస్తీకి మంగళవారం ఉదయం భారీసంఖ్యలో పోలీసుల చేరుకున్నారు.

హైదరాబాద్: సూరారం కాలనీలోని 60 గజాల బస్తీకి మంగళవారం ఉదయం భారీసంఖ్యలో పోలీసుల చేరుకున్నారు. అక్రమార్కులను ఖాళీ చేయించాలంటూ కోర్టు నుంచి జీహెచ్ఎంసీ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో వెంటనే స్పందించిన అధికారులు అక్రమంగా ఆ స్థలంలో ఉంటున్న వారిని అక్కడినుంచి ఖాళీచేయించేందుకు సూరారం కాలనీకి పోలీసులను పంపించారు.

కాలనీలో అల్లర్లు జరగకుండా ముందస్తుగా పలువురు బస్తీవాసులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రభుత్వం కేటాయించిన 60 గజాల బస్తీలో లబ్ధిదారులు కాకుండా బయటివ్యక్తులు ఉండటంతో వారు కోర్టును ఆశ్రయించిన విషయం విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement