చర్లపల్లి జైలును సందర్శించిన హైపవర్ కమిటీ బృందం | high Powered committee visited the Cherlapally prison | Sakshi
Sakshi News home page

చర్లపల్లి జైలును సందర్శించిన హైపవర్ కమిటీ బృందం

Jun 30 2016 7:45 PM | Updated on Sep 4 2018 5:21 PM

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘనందన్‌రావులతో కూడిన హైపర్ కమిటీ బృందం గురువారం చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలును సందర్శించింది.

నగరం నడిబొడ్డున ఉన్న చంచల్‌గూడ జైలు తరలింపు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘనందన్‌రావులతో కూడిన హైపర్ కమిటీ బృందం గురువారం చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలును సందర్శించింది.

 

చంచల్‌గూడ జైలును చర్లపల్లి ఓపెన్ ఎయిర్‌ జైలుకు మార్చాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలిసిందే. ఈ క్రమంలో చర్లపల్లిలో ఉన్న వసతులను పరిశీలనలో భాగంగానే వారు జైలును సందర్శించి అధికారులతో చర్చించారు. ఓపెన్ ఎయిర్ జైలును ప్రత్యామ్నాయంగా ఎక్కడకు మార్చాలన్న పలు అంశాలపై సమీక్షించి వెళ్లారు. వారితో పాటుగా జైళ్లశాఖ డీజీ వీకే సింగ్, డీఐజీ నరసింహ, చర్లపల్లి జైళ్ల పర్యవేక్షణాధికారులు కొలను వెంకటేశ్వర్ రెడ్డి, రాజేశ్‌లు ఉన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement