'హెల్మెట్ నిబంధన రద్దు చేయాలి' | hemet policy cancel says amanukkal khan | Sakshi
Sakshi News home page

'హెల్మెట్ నిబంధన రద్దు చేయాలి'

Sep 6 2015 9:12 PM | Updated on Sep 4 2018 5:16 PM

రాష్ట్రంలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు ధరించడం తప్పనిసరి అనే నిబంధనను ఎత్తివేయాలని తెలంగాణ టూవీలర్ రైడర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

సుల్తాన్‌బజార్ (హైదరాబాద్): రాష్ట్రంలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు ధరించడం తప్పనిసరి అనే నిబంధనను ఎత్తివేయాలని తెలంగాణ టూవీలర్ రైడర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆదివారం హైదర్‌గూడలోని ఎన్‌ఎస్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ కన్వీనర్ మహ్మద్ అమానుల్లాఖాన్ మాట్లాడారు. ప్రమాదాల నివారణకు హెల్మెట్ల వాడకం ముఖ్యం కాదని, ట్రాఫిక్ నియమ నిబంధనలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు.

కల్తీసారా, ధూమపానం వాడకంతో నిత్యం అధిక సంఖ్యలో ప్రజలు మత్యువాత పడుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆ విషయాన్ని పట్టించుకోకుండా హెల్మెట్ వాడకం తప్పనిసరి చేయడం విచారకరమన్నారు. ద్విచక్ర వాహనదారుల పాలిట శాపంగా మారిన ఎంవీ 129 యాక్ట్ చట్టాన్ని ప్రభుత్వం వెంటనే సవరించాలని కోరారు. ఈ సమావేశంలో అసోసియేషన్ నాయకులు పలువురు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement