పచ్చదనమే ఆధారం.. అందుకే హరితహారం | harithaharam at csi wesley girls high school, secunderabad | Sakshi
Sakshi News home page

పచ్చదనమే ఆధారం.. అందుకే హరితహారం

Jul 16 2017 2:16 AM | Updated on Sep 5 2017 4:06 PM

పచ్చదనమే ఆధారం.. అందుకే హరితహారం

పచ్చదనమే ఆధారం.. అందుకే హరితహారం

మూడో విడత హరితహారంలో భాగంగా శనివారం సికింద్రాబాద్‌లోని సీఎస్‌ఐ వెస్లీ గర్ల్స్‌ హైస్కూల్‌ విద్యార్థినులు, సిబ్బంది ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు.

- వెస్లీ గర్ల్స్‌ హైస్కూల్లో మొక్కలు నాటిన విద్యార్థినులు, టీచర్లు
హైదరాబాద్‌:
రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన హరితహారం అప్రతిహతంగా కొనసాగుతున్నది. మూడో విడత హరితహారంలో భాగంగా శనివారం సికింద్రాబాద్‌లోని సీఎస్‌ఐ వెస్లీ గర్ల్స్‌ హైస్కూల్‌ విద్యార్థినులు, సిబ్బంది ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా వెస్లీ గర్ల్స్‌ హైస్కూల్‌ ప్రిన్సిపల్‌ మేరి సునీల వినోద్‌ విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడుతూ.. పచ్చదనం ఆవశ్యకమని, నాటిన మొక్కలను సంరక్షించుకోవాలని అన్నారు. హరితహారంపై విద్యార్థినులు డ్రాయింగ్‌, కాంపిటీషన్‌, డిబేట్‌ చేపట్టారు.

ఈ కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపల్‌ సజిత, ప్రైమరీ సెక్షన్‌ ప్రిన్సిపల్‌ విజయప్రభావతి, పీఈటీ దీవెన, టీచర్లు సుజ్ఞాన, వికాసిని, లేయారాణి, రీటా, కెజియా, విజయకుమారి, ధనలక్ష్మీ, అరుణ, వాసంతి, జ్యోతి, హేమలత, సూజన్‌, పద్మ, లక్ష్మీ సువర్చల, సుజాత, సునీత, సిబ్బంది ఆలివ్‌, ప్రసాద్‌, రవిప్రకాశ్‌తోపాటు సుకన్య తదితరులు పాల్గొన్నారు.








Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement