ఎన్నికలను ప్రశ్నార్థకం చేస్తున్నాయి | gutha sukhendar fired on tdp and trs party's | Sakshi
Sakshi News home page

ఎన్నికలను ప్రశ్నార్థకం చేస్తున్నాయి

May 7 2016 4:01 AM | Updated on Mar 18 2019 9:02 PM

ఎన్నికలను ప్రశ్నార్థకం చేస్తున్నాయి - Sakshi

ఎన్నికలను ప్రశ్నార్థకం చేస్తున్నాయి

తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ, టీఆర్‌ఎస్ పార్టీలు ఎన్నికలను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ గుత్తా

టీడీపీ, టీఆర్‌ఎస్‌పై గుత్తా ధ్వజం

 సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ, టీఆర్‌ఎస్ పార్టీలు ఎన్నికలను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ దుయ్యబట్టారు. శుక్రవారం ఇక్కడి ఏపీభవన్‌లో వారు విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై ఇప్పటికే సీఎల్పీ తరఫున స్పీకర్‌కు ఫిర్యాదు చేశామని వివరించారు. కృష్ణా, గోదావరి నీటి కేటాయింపుల్లో పూర్తి వాటాను వాడుకునే హక్కు తెలంగాణకు ఉందని గుత్తా పేర్కొన్నారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీరు ఇవ్వడం సాధ్యమేనని, కాంగ్రెస్ హయాంలో 48 లక్షల ఎకరాలకు నీరందిందని వివరించారు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కేంద్రంలో మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం కరువు పరిస్థితిని వదిలి రాజకీయాలపైనే దృష్టిపెట్టాయని ధ్వజమెత్తారు. వెంటనే కరువు ప్రాంతాలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement