నేడు గురుకులాల స్క్రీనింగ్‌ టెస్టు ఫలితాలు! | Gurukuls screening test results today! | Sakshi
Sakshi News home page

నేడు గురుకులాల స్క్రీనింగ్‌ టెస్టు ఫలితాలు!

Jun 21 2017 12:19 AM | Updated on Sep 5 2017 2:04 PM

గురుకులాల్లోని పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (పీజీటీ), ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (టీజీటీ), ఫిజికల్‌ డైరెక్టర్‌ (పీడీ) పోస్టుల భర్తీకి గత నెల 31న నిర్వహించిన స్క్రీనింగ్‌ టెస్టు

సాక్షి, హైదరాబాద్‌: గురుకులాల్లోని పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (పీజీటీ), ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (టీజీటీ), ఫిజికల్‌ డైరెక్టర్‌ (పీడీ) పోస్టుల భర్తీకి గత నెల 31న నిర్వహించిన స్క్రీనింగ్‌ టెస్టు ఫలితాలను ఈ నెల 21(బుధవారం)న విడుదల చేసేందుకు టీఎస్‌పీఎస్సీ చర్యలు చేపట్టింది. బుధవారం ఫలితాల విడుదల సాధ్యం కాకపోతే 22న విడుదల చేయాలని భావిస్తోంది. ఫలితాలకు సంబంధించిన ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేసినట్లు పేర్కొంది.

పరీక్షల ఫలితాలు విడుదల కాకముందే మెయిన్‌ పరీక్ష తేదీలను టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. దీంతో ఎవరు మెయిన్‌ పరీక్షలకు ఎంపికయ్యారన్న వివరాలు తెలియకపోవడంతో అభ్యర్థులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధ, గురువారాల్లో ఫలితాలను విడుదల చేసేందుకు చర్యలు చేపట్టింది. అనంతరం మెయిన్‌ పరీక్షలకు ఎంపికైన అభ్యర్థుల మెరిట్‌ జాబితాలను కూడా ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement