బోనమెత్తిన నగరి | Golkonda bonalu celebrations | Sakshi
Sakshi News home page

బోనమెత్తిన నగరి

Jul 20 2015 12:17 AM | Updated on Sep 3 2017 5:48 AM

బోనమెత్తిన నగరి

బోనమెత్తిన నగరి

తెలంగాణ సంప్రదాయ ఉత్సవం బోనాలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి...

ఆధ్యాత్మిక ఝరి.. భక్త జనసిరి..
తెలంగాణ సంప్రదాయ ఉత్సవం బోనాలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవ ఊరేగింపుతో చారిత్రక గోల్కొండ కోట పులకించింది. కోటకు దారితీసే అన్ని మార్గాల్లో భక్తులు బారులు తీరి జగదాంబికకు మొక్కులు చెల్లించుకున్నారు. నెత్తిన బోనాలతో మహిళలు.. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, తొట్టెల ఊరేగింపుతో గోల్కొండ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. విద్యుద్దీపాల కాంతుల్లో కోట దేదీప్యమానంగా వెలుగులీనింది. ఈ సారి ఉత్సవాల తొలిరోజే అమ్మవారి భారీ విగ్రహాల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.    
  - లంగర్‌హౌస్/గోల్కొండ

Advertisement
 
Advertisement
Advertisement