'పట్టుకున్న కొద్ది దొరుకుతున్న బంగారం' | Gold seized in Shamshabad Airport | Sakshi
Sakshi News home page

'పట్టుకున్న కొద్ది దొరుకుతున్న బంగారం'

Feb 28 2014 9:35 AM | Updated on Sep 2 2017 4:12 AM

'పట్టుకున్న కొద్ది దొరుకుతున్న బంగారం'

'పట్టుకున్న కొద్ది దొరుకుతున్న బంగారం'

: శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుకునే కొద్ది బంగారం దొరుకుతోంది. దొంగ బంగారంతో శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన ఓ ప్రయాణికుడు కస్టమ్స్ అధికారులకు దొరికిపోయాడు.

హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుకునే కొద్ది బంగారం దొరుకుతోంది. దొంగ బంగారంతో శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన ఓ ప్రయాణికుడు కస్టమ్స్ అధికారులకు దొరికిపోయాడు. శుక్రవారం ఉదయం సింగపూర్ నుంచి వచ్చిన హుస్సేన్ అనే వ్యక్తి నుంచి సుమారు రూ. 75 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతగాడు బంగారాన్ని లోదుస్తుల్లో పెట్టుకుని వచ్చినా అధికారుల తనిఖీల్లో బయటపడింది. హుస్సేన్ను అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మరోవైపు బెంగుళూరు నుంచి వచ్చిన నలుగురిని కృష్ణాజిల్లా గన్నవరం ఎయిర్‌పోర్టులో ఇన్‌కంట్యాక్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 5 బ్యాగులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాగుల్లో బంగారం తీసుకొస్తున్నారన్న ముందస్తు సమాచారంతో ఇన్‌కంట్యాక్స్‌ అధికారులు ఎయిర్‌పోర్టుకు చేరుకుని వీరిని అదుపులోకి తీసుకున్నారు. నలుగురిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. అయితే ఐటీ అధికారులు ... ఎయిర్‌పోర్టు పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వీరిని విజయవాడ తరలించడం అనుమానాలకు తావిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement