ప్రియురాలి ఇంట్లో ప్రియుడి ఆత్మహత్య | Girlfriend house at Boyfriend Suicide | Sakshi
Sakshi News home page

ప్రియురాలి ఇంట్లో ప్రియుడి ఆత్మహత్య

Dec 15 2014 1:39 AM | Updated on Sep 2 2017 6:10 PM

ప్రియురాలు తనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మనస్తాపం చెంది ఆమె ఇంట్లోనే ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

లంగర్‌హౌస్: ప్రియురాలు తనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మనస్తాపం చెంది ఆమె ఇంట్లోనే ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. లంగర్‌హౌస్ ఎస్సై శశిధర్ కథనం ప్రకారం... ఖమ్మం జిల్లాకు చెందిన పిచ్చయ్య(42) గుడిమల్కాపూర్‌లో కుటుంబసభ్యులతో కలిసి ఉంటూ మేస్త్రీ పని చేస్తూ జీవిస్తున్నాడు. తన వద్ద కూలీ పనిచేసే లంగర్‌హౌస్ కనకదుర్గా కాలనీకి చెందిన యాదమ్మతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

ఆదివారం మధ్యాహ్నం పూటుగా మద్యం తాగిన పిచ్చయ్య యాదమ్మ ఇంటికి వచ్చాడు. డబ్బుల విషయంలో ఇద్దరూ రెండు గంటల పాటు గొడవపడ్డారు. యాదమ్మ ఆదివారం రాత్రి పిచ్చయ్య తన ఇంట్లో ఉండగానే పరుగు పరుగున లంగర్‌హౌస్ పోలీసుస్టేషన్‌కు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు యాదమ్మ ఇంటికి వెళ్లగా.. లోపలి నుంచి గడియపెట్టి ఉంది. పిలిచినా యాదయ్య తలుపు తీయకపోవడంతో పోలీసులు తలుపులు బద్ధలుకొట్టి చూడగా.. చీరతో ఉరికి వేలాడుతూ కనిపించాడు.

కొన ఊపిరితో ఉన్న యాదయ్యను సమీపంలోనే ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. డబ్బుల విషయంలో తమ మధ్య గొడవ జరిగిందని యాదమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, తనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మనస్తాపం చెంది యాదయ్య ఆత్మహత్య చేసుకున్నాడా? వేరే కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement