హోటళ‍్ళపై జీహెచ్‌ఎంసీ దాడులు | GHMC rides on hotels | Sakshi
Sakshi News home page

హోటళ‍్ళపై జీహెచ్‌ఎంసీ దాడులు

Apr 3 2017 1:01 PM | Updated on Sep 5 2017 7:51 AM

హోటళ‍్ళపై జీహెచ్‌ఎంసీ దాడులు

హోటళ‍్ళపై జీహెచ్‌ఎంసీ దాడులు

జీహెచ్‌ఎంసీ పరిధిలోని హోటళ‍్లు, రెస్టారెంట‍్లపై ప్రజారోగ‍్యశాఖ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర‍్వహించారు.

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ పరిధిలోని హోటళ‍్లు, రెస్టారెంట‍్లపై ప్రజారోగ‍్యశాఖ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర‍్వహించారు. సోమవారం ఉదయం దాడులు చేపట్టి అపరిశుభ్రత, అధికార ముద్ర లేని మాంసం ఉపయోగిస్తున‍్న హోటళ‍్లపై చర‍్యలు తీసుకున‍్నారు. శాపూర్‌నగర్‌లో సాగర్‌ రెస్టారెంట్‌ను అధికారులు మూసివేశారు.

నల్గొండ క్రాస్ రోడ్ లోని సోహైల్ హోటల్ కు అధికారులు 40 వేల రూపాయల జరిమానా విధించారు. అలాగే అధికార ముద్రలేని మాంసం వినియోగించినందుకు ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులోని ఆ​స్టియా హోటల్‌కు 20 వేల రూపాయలు, ఐఎస్ సదన్‌ చౌరస్తాలోని ప్యారడైజ్‌ హోటల్‌కు రూ. 20 వేలు జరిమానా విధించారు. 

Advertisement
 
Advertisement
Advertisement