జీహెచ్‌ఎంసీ కమిషనర్‌పై గవర్నర్‌కు లేఖ | GHMC Commissioner Letter to the Governor | Sakshi
Sakshi News home page

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌పై గవర్నర్‌కు లేఖ

Nov 16 2014 1:34 AM | Updated on Aug 11 2018 4:02 PM

జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ ప్రజలకవసరమైన రోడ్డు పనులు జరుగకుండా చేస్తున్నారని జీహెచ్‌ఎంసీలో టీడీపీ పక్ష నాయకుడు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు.

సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ ప్రజలకవసరమైన రోడ్డు పనులు జరుగకుండా చేస్తున్నారని జీహెచ్‌ఎంసీలో టీడీపీ పక్ష నాయకుడు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఈమేరకు ఆయన శుక్రవారం గవర్నర్‌కు ఫిర్యాదు లేఖ రాశారు. శేరిలింగంపల్లి- బాంబే హైవేకు లింక్‌రోడ్డుగా మజీద్‌బండ రోడ్డు నిర్మించేందుకు గతంలో ప్రతిపాదనలున్నా, కమిషనర్ ఆపనులు చేపట్టడం లేదన్నారు. సదరు రోడ్డు  చంద్రబాబునాయుడి ఇంటికి దారి తీస్తున్నందునే రోడ్డు పనులు చేయడంలేదని ఆరోపించారు.  

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెద్దల మన్నన పొందేందుకు ఆయన ఈ రోడ్డు పనులు చేపట్టడం లేదన్నారు. ప్రత్యూష్‌సిన్హా కమిటీ ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించినప్పటికీ, తెలంగాణలోనే ఉండాలనుకుంటున్న కమిషనర్.. ముఖ్యమంత్రి మన్నన పొందేందుకు ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రజలకవసరమైన రోడ్డును రాజకీయ కారణాలతో వేయకపోవడం సరికాదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement