బెయిల్‌పై నయీం అనుచరుడి విడుదల | gangster nayeem follower released on bail | Sakshi
Sakshi News home page

బెయిల్‌పై నయీం అనుచరుడి విడుదల

Feb 25 2017 3:16 PM | Updated on Sep 5 2017 4:35 AM

గ్యాంగ్‌స్టర్‌ నయీం ప్రధాన అనుచరుడు నగేష్‌ అలియాస్‌ క్రాంతి శనివారం ఉదయం చర్లపల్లి కేంద్ర కారాగారం నుంచి బెయిల్‌పై విడుదలయ్యాడు.

హైదరాబాద్‌: గ్యాంగ్‌స్టర్‌ నయీం ప్రధాన అనుచరుడు నగేష్‌ అలియాస్‌ క్రాంతి శనివారం ఉదయం చర్లపల్లి కేంద్ర కారాగారం నుంచి బెయిల్‌పై విడుదలయ్యాడు. నయీం ఎన్‌కౌంటర్‌ అనంతరం ఇతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ మావోయిస్టు నేత కొనపురి రాములు, జడల నాగరాజు, పోచయ్య తదితర హత్య కేసుల్లో ప్రధాన నిందితుడు. ఇతనిపై 45 కేసులు ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నాయి. గతంలో దుబ్బాక ఏరియా మావోయిస్టు కమాండర్ గా పనిచేసిన నగేష్‌ 1996లో పోలీసులకు లొంగిపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement