కేరళ చరిత్రలో ఓ ట్రాన్స్‌ జెండర్‌ తొలిసారిగా శబరిమల.. | - | Sakshi
Sakshi News home page

కేరళ చరిత్రలో ఓ ట్రాన్స్‌ జెండర్‌ తొలిసారిగా శబరిమల..

Published Mon, Jan 1 2024 12:56 AM | Last Updated on Mon, Jan 1 2024 1:53 PM

- - Sakshi

సూర్యపేట: కేరళ చరిత్రలో ఓ ట్రాన్స్‌ జెండర్‌ తొలిసారి శబరిమల అయ్యప్పను దర్శించుకున్నారు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వరస్వామి దేవాలయంలో జరిగే బ్రహోత్సవాలకు, ప్రతి అమావాస్యకు విచ్చేసే ట్రాన్‌జెండర్‌ జోగిని నిషా క్రాంతి ఆదివారం శబరిమల అయ్యప్ప ఆలయంలో స్వామివారిని దర్శించుకుంది. ట్రాన్స్‌ జెండర్‌ ఐడీ ఆధారంగా ఆమెకు కేరళ ప్రభుత్వం దర్శనానికి అనుమతిచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ట్రాన్స్‌ జండర్‌లు చాలా మంది అయప్ప మాల ధరించి స్వామిని దర్శించుకోవాలని అనుకుంటున్నారని చెప్పింది. తనకు దర్శనం కల్పించిన కేరళ ప్రభుత్వానికి ఆమె ధన్యవాదాలు తెలిపింది. ఇది ఒక శుభ పరిణామమని.. తాను కూడా అందరిలాగే శబరిమల కొండ ఎక్కి అయ్యప్పను దర్శించుకోవడంతో తన జన్మ ధన్యం అయిందని పేర్కొంది.

ఇవి చ‌ద‌వండి: New year 2024: సరి ‘కొత్తగా’ సాగుదాం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement