నేడే పుర భవితవ్యం | - | Sakshi
Sakshi News home page

నేడే పుర భవితవ్యం

Feb 13 2026 7:04 AM | Updated on Feb 13 2026 7:04 AM

నేడే పుర భవితవ్యం

నేడే పుర భవితవ్యం

లెక్కింపు కేంద్రం వద్ద

350 సిబ్బందితో బందోబస్తు

సూర్యాపేటటౌన్‌, సూర్యాపేటఅర్బన్‌ : మున్సిపాలిటీల్లో ఆయా పార్టీల నుంచి, ఇండింపెండెంట్‌గా పోటీ చేసిన 612 మంది అభ్యర్థుల భవితవ్యం శుక్రవారం తేలనుంది. సూర్యాపేటలోని ఎస్వీ ఇంజనీరింగ్‌ కళాశాలలో కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ ప్రక్రియ ఉదయం 8గంటలకు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12గంటల వరకు అన్ని వార్డుల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అయితే అభ్యర్థులు ఉదయం 7గంటల లోపు కౌంటింగ్‌ కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు.

ఐదు మున్సిపాలిటీల్లో

137 వార్డులకు కౌంటింగ్‌

జిల్లాలోని సూర్యాపేట, కోదాడ, హుజుర్‌నగర్‌, నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపాలిటీలకు సంబంధించి మొత్తం 137 వార్డుల లెక్కింపు జరగనుంది. సూర్యాపేట మున్సిపాలిటీలోని 48వ వార్డులకు గాను ఎస్వీ ఇంజనీరింగ్‌ కళాశాలలోని రెండో అంతస్తులో 425, 525, 627 రూం నంబర్లలో కౌంటింగ్‌ ఏర్పాట్లు పూర్తి చేశారు. కోదాడ మున్సిపాలిటీలో 35 వార్డులకు గాను మూడు వార్డులు ఏకగ్రీవం కాగా ఎన్నికలు జరిగిన 32 వార్డులకు కౌంటింగ్‌ జరగనుంది. వీటి కోసం కళాశాలలోని రెండో ఫ్లోర్‌లో గల 321, 327, 328 రూం నంబర్లలో కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తిచేశారు. హుజూర్‌నగర్‌ 28వార్డులకు గాను ఒకటి ఏకగ్రీవం కాగా 27 వార్డులకు ఎన్నికలు జరిగాయి. కళాశాలలోని మొదటి అంతస్తులో 511, 512, 513 రూం నంబర్లలో కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేశారు. నేరేడుచర్ల పరిధిలోని 15 వార్డులకు కళాశాలలోని మొదటి అంతస్తులోని 616, 612 రూం నంబర్లలో ఏర్పాటు చేశారు. తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని 15 వార్డులకు మొదటి అంతస్తులోని 316, 317 రూం నంబర్లను కౌంటింగ్‌కు కేటాయించారు.

అభ్యర్థుల్లో టెన్షన్‌..

మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన నాటి నుంచి ఆశావహులు ప్రచారాలు మొదలుపెట్టారు. మొత్తం 612 మంది అభ్యర్థులు ఆయా పార్టీలు, స్వతంత్రులు పోటీ చేశారు. వీరి భవితవ్యం బ్యాలెట్‌ బాక్సుల్లో నిక్షిప్తమై ఉంది. ఫలితం ఎలా ఉండబోతుందోనని వారిలో టెన్షన్‌ మొదలైంది.

ఓట్ల లెక్కింపు సందర్భంగా 350 మంది పోలీస్‌లతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రం శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్‌ కళాశాల వద్ద నిషేధ ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మూడంచెల భద్రత నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు కేంద్రం వద్ద 163 బీఎన్‌ఎస్‌ఎస్‌ (144 సెక్షన్‌) అమలు ఉంటుందని తెలిపారు. ఓట్ల లెక్కింపునకు హాజరయ్యే అభ్యర్థులు, ఏజెంట్లు, నిషేధిత వస్తువులు అగ్గిపెట్టెలు, లైటర్‌, ఇంక్‌ బాటిల్స్‌, పేలుడుకు కారణమయ్యే ఎలాంటి వస్తువులను లెక్కింపు కేంద్రాల్లోకి తీసుకురాకూడదని సూచించారు. మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల అనంతరం ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు, బైక్‌ ర్యాలీలు, డీజేలు, టపాకాయలు కాల్చడానికి అనుమతి లేదని తెలిపారు.

ఐదు మున్సిపాలిటీల పరిధిలో 137 వార్డులకు కౌంటింగ్‌

ఫ ఉదయం 8గంటల నుంచి

ప్రక్రియ ప్రారంభం

ఫ మధ్యాహ్నం 12గంటల వరకు అన్ని వార్డుల ఫలితాలు వచ్చే అవకాశం

ఫ సూర్యాపేటలోని ఎస్వీ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏర్పాట్లు పూర్తి

ఫ లెక్కింపు కేంద్రం వద్ద

పోలీసుల పటిష్ట బందోబస్తు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement