యూరియా యాప్ రద్దు చేయాలని రాస్తారోకో
నడిగూడెం : యూరియా యాప్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం నడిగూడెం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట ప్రధాన రహదారిపై స్థానిక రైతులు రాస్తారోకో నిర్వహించారు. పలువురు రైతులు మాట్లాడుతూ.. తమ వద్ద స్మార్ట్ ఫోన్‌లు లేకపోవడంతో యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకోలేపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పాత పద్ధతిలోనే యూరియా అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి బెల్లకొండ సత్యనారాయణ, మాజీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ జలీల్, రైతులు శ్రీను, సైదులు, జానిమియా, చంద్రమోహన్, పోతురాజు, బుచ్చిరాజు, మహేష్, రాజశేఖర్ పాల్గొన్నారు.


