డీకే అరుణ రాజీనామా | gadwal mla DK Aruna resigns | Sakshi
Sakshi News home page

డీకే అరుణ రాజీనామా

Oct 1 2016 1:51 PM | Updated on Aug 14 2018 10:59 AM

డీకే అరుణ రాజీనామా - Sakshi

డీకే అరుణ రాజీనామా

గద్వాలను జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే డీకే అరుణ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

హైదరాబాద్: గద్వాలను జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే డీకే అరుణ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తాను గద్వాల ఎమ్మెల్యేగా ఉన్నందుకే జిల్లాగా ప్రకటించడంలేదని చెబుతున్నారని, అందుకే తన పదవికి రాజీనామా చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు లేఖ రాశానని తెలిపారు.

హైదరాబాద్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీకే అరుణ మాట్లాడుతూ.. గద్వాలను జిల్లా చేయాలని వేలాది మంది ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారని, పాదయాత్రలు, దీక్షలు చేపట్టామని, అయినా కేసీఆర్ స్పందించలేదని చెప్పారు. గద్వాల జిల్లాను ప్రకటించి తన రాజీనామా లేఖను స్పీకర్కు పంపాల్సిందిగా సీఎం కేసీఆర్​ను కోరుతున్నట్టు డీకే అరుణ చెప్పారు.

 

Advertisement
 
Advertisement
Advertisement