అమీర్‌పేట మైత్రీవనం సమీపంలోని ప్రైమ్ ఆసుపత్రిలో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది.
అమీర్‌పేట మైత్రీవనం సమీపంలోని ప్రైమ్ ఆసుపత్రిలో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం ఆస్పత్రి లిఫ్ట్ సమీపంలో ఉన్న వైర్లలో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. సనత్‌నగర్ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు సకాలంలో అక్కడకు చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఏమాత్రం ఆలస్యమైనా పెద్ద ప్రమాదం జరిగి చికిత్స పొందుతున్న రోగులు తీవ్ర ఇబ్బందులు పడేవారని ఫైర్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు.