
సింగరేణి భవన్ లో అగ్ని ప్రమాదం
హైదరాబాద్ నగరం లక్డీకపూల్ లోని సింగరేణి భవన్లో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
హైదరాబాద్: హైదరాబాద్ నగరం లక్డీకపూల్ లోని సింగరేణి భవన్లో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భవనంలోని ఒకటో అంతస్తు నుంచి మూడో అంతస్తు వరకు మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఇంకా కొంతమంది ఉద్యోగులు మంటల్లోనే చిక్కుకున్నట్టు సమాచారం. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ అగ్ని ప్రమాదం సంభవించిందని అధికారులు అంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.