హైదరాబాద్ నగరంలోని శిల్పారామంలో గత అర్థరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని శిల్పారామంలో గత అర్థరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దసరా ఉత్సవాలు సందర్భంగా శిల్పారామంలో ఏర్పాటు చేసిన స్టాల్స్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో 10 షాపులు దగ్దమైనాయి. భద్రత సిబ్బంది వెంటనే స్పందించి అగ్నిమాపక శాఖ, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఫైరింజన్లతో సహా అక్కడికి చేరుకుని మంటలు అర్పివేశాయి. అగ్రిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.