షాపింగ్ మాల్లో అగ్ని ప్రమాదం | fire accident at centro show room | Sakshi
Sakshi News home page

షాపింగ్ మాల్లో అగ్ని ప్రమాదం

Aug 6 2016 5:56 PM | Updated on Sep 5 2018 9:47 PM

షాపింగ్ మాల్లో అగ్ని ప్రమాదం - Sakshi

షాపింగ్ మాల్లో అగ్ని ప్రమాదం

సెంట్రో షాపింగ్ మాల్ లో శనివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది.

హైదరాబాద్: నగరంలోని చందానగర్ గంగారం వద్ద ఉన్న సెంట్రో షాపింగ్ మాల్ లో శనివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. కొన్ని నిమిషాల్లోపే మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ వెలువడింది. దీంతో షోరూమ్ లోని వస్తువులన్నీ దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement