పోలీసుల అదుపులో నకిలీ డీఎస్పీ | fake police arrested at SR nagar | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో నకిలీ డీఎస్పీ

Jul 9 2016 2:21 PM | Updated on Aug 20 2018 4:27 PM

నగరంలోని ఎస్ఆర్ నగర్ లో ఓ నకిలీ డీఎస్పీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్: నగరంలోని ఎస్ఆర్ నగర్ లో ఓ నకిలీ డీఎస్పీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనిల్ కుమార్ అనే వ్యక్తి ఎసీబీ డీఎస్పీ అని చెప్పుకుంటూ డబ్బులు దోచుకుంటున్నాడు. అరవింద్ కుమార్ అనే డ్రగ్ ఇన్ స్పెక్టర్ కు బెదిరించిన అనిల్ దాదాపు రూ. 4 లక్షల వరకు దండుకున్నాడు. దాంతో ఆగకుండా మళ్లీ ఐపోన్ కావాలంటూ బెదిరింపులకు దిగాడు. అరవింద్ అతని ఆగడాలను భరించలేక పోలీసులకు ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన ఎస్ ఆర్ నగర్ పోలీసులు పక్కా ప్లాన్ తో నకిలీ డీఎస్పీని అరెస్టు చేశారు.  
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement