నకిలీ 2వేల నోట్లు ముద్రిస్తూ.. | fake notes printing gang arrested in lb nagar | Sakshi
Sakshi News home page

నకిలీ 2వేల నోట్లు ముద్రిస్తూ..

Nov 26 2016 9:56 AM | Updated on Sep 27 2018 9:08 PM

నకిలీ 2వేల నోట్లు ముద్రిస్తూ.. - Sakshi

నకిలీ 2వేల నోట్లు ముద్రిస్తూ..

కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేసిన తర్వాత రిజర్వు బ్యాంకు కొత్తగా విడుదల చేసిన 2000 రూపాయల నోట్లకు నకిలీ నోట్లను ముద్రిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టుచేశారు.

కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేసిన తర్వాత రిజర్వు బ్యాంకు కొత్తగా విడుదల చేసిన 2000 రూపాయల నోట్లకు నకిలీ నోట్లను ముద్రిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టుచేశారు. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ పరిసరాల్లో ఈ ముఠాకు చెందిన ఆరుగురు వ్యక్తులను రాచకొండ కమిషనరేట్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 3 లక్షల రూపాయల విలువైన నకిలీ 2వేల నోట్లు స్వాధీనం చేసుకున్నారు. 
 
కొత్తగా విడుదలైన నోట్లలో పెద్దగా అదనపు సెక్యూరిటీ ఫీచర్లు ఏమీ పెట్టలేదని సాక్షాత్తు రిజర్వు బ్యాంకు వర్గాలు, ఆర్థిక మంత్రిత్వశాఖ వర్గాలే చెప్పడంతో ఎక్కడికక్కడ దొంగనోట్ల ముఠాలు విజృంభిస్తున్నాయి. కొత్తవాటికి కూడా దొంగనోట్లను ముద్రించి చలామణిలోకి తేవాలని ప్రయత్నిస్తున్నాయి. అఇయతే రాచకొండ పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ఎల్బీనగర్ పరిసరాల్లో ఉన్న ఒక ముఠా పట్టుబడింది.

Advertisement
 
Advertisement
Advertisement