ప్రాణంమీదికి వచ్చిన ఫేస్‌బుక్ కామెంట్ | Facebook comment is gone to death | Sakshi
Sakshi News home page

ప్రాణంమీదికి వచ్చిన ఫేస్‌బుక్ కామెంట్

Feb 25 2015 9:16 PM | Updated on Jul 26 2018 5:23 PM

ఫేస్‌బుక్‌లో పెట్టిన ఫొటోకు వచ్చిన కామెంట్ ప్రాణంమీదికి వచ్చింది. ఈ సంఘటన నగరంలోని చంద్రాయణగుట్టలో బుధవారం జరిగింది.

చంద్రాయణగుట్ట(హైదరాబాద్ క్రైం): ఫేస్‌బుక్‌లో పెట్టిన ఫొటోకు వచ్చిన కామెంట్ ప్రాణంమీదికి వచ్చింది. ఈ సంఘటన నగరంలోని చంద్రాయణగుట్టలో బుధవారం జరిగింది. వివరాలు..చంద్రాయణగుట్టకు చెందిన ఇర్ఫాన్(19) ఇటీవల ఫేస్‌బుక్‌లో ఫొటోను పెట్టాడు. ఈ క్రమంలో అతని స్నేహితులు ఆ ఫొటోకి వ్యంగ్యంగా కామెంట్‌లు రాశారు. దీంతో ఆగ్రహించిన ఇర్ఫాన్ తన స్నేహితులు భవజీర్, ఓబీద్,ఖలీద్‌లకు ఫొన్ చేశాడు. ఈ క్రమంలో వారు చంద్రామణగుట్ట జీఎమ్. చావన్ వస్తే మాట్లాడుకుందామని చెప్పారు.

దీంతో మంగళవారం అర్ధరాత్రి ఇర్ఫాన్ వారివద్దకు వెళ్లాడు. అక్కడ ముగ్గురు స్నేహితులు కలిసి ఇర్ఫాన్ కొట్టి, కత్తితో అతనిపై దాడి చేశారు. చుట్టుపక్కన ఉన్నవారు పోలీసులకు సమాచారం అందించటంతో వారు సంఘటనా స్థలానికి చేరుకొని తీవ్రంగా గాయపడిన ఇర్ఫాన్‌ను శాలిబండలోని ఆస్పత్రికి తరలించారు. కాగా, ఆ ముగ్గురు స్నేహితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement