గెలిచే స్థానాల్లో కేసీఆర్ వారసులా ? | Errabelli Dayakar Rao takes on Telangana Rashtra Samithi chief Kalvakuntla Chandrashekar Rao | Sakshi
Sakshi News home page

గెలిచే స్థానాల్లో కేసీఆర్ వారసులా ?

Apr 4 2014 2:35 PM | Updated on Aug 11 2018 4:48 PM

గెలిచే స్థానాల్లో కేసీఆర్ వారసులా ? - Sakshi

గెలిచే స్థానాల్లో కేసీఆర్ వారసులా ?

రానున్న అసెంబ్లీ ఎన్నికలలో అభ్యర్థులు జాబితా ప్రకటించిన టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్పై టి.టీడీపీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం నిప్పులు చెరిగారు.

రానున్న అసెంబ్లీ ఎన్నికలలో అభ్యర్థులు జాబితా ప్రకటించిన టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్పై టి.టీడీపీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం నిప్పులు చెరిగారు. విజయం సాధించే స్థానాలు మాత్రం కేసీఆర్ కుటుంబ సభ్యులకు కేటాయించుకుని ... ఓడిపోతామనుకున్న స్థానాలను విద్యార్థులు, ఉద్యమకారులకు కేటాయించారని  ఎర్రబెల్లి ఆరోపించారు.

 

తెలంగాణ తొలి సీఎం దళితుడ్ని చేస్తానన్న కేసీఆర్ ఇప్పుడు మాట మార్చారని విమర్శించారు. కేసీఆర్ మాటలు నమ్మే పరిస్థితిలో ఎవరు లేరన్నారు. కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయారని కేసీఆర్పై ఎర్రబెల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఆస్తులు పెంచుకునే పనిలో నిమగ్నమైయ్యారని ఎర్రబెల్లి ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement